దేశంలో కరోనా వైరస్ వ్యాప్తి కొద్దిరోజులుగా ఒకేలా కొనసాగుతోంది. దాదాపు నెలకుపైగా 20 వేలకు అటు, ఇటుగానే కొత్త కేసులు బయటపడుతున్నాయి. గడిచిన 24 గంటల్లో కొత్తగా 18 వేల 139 కేసులు నమోదయ్యాయి. వీటితో కలిపి దేశంలో మొత్తం బాధితుల సంఖ్య ఒక కోటీ 4 లక్షల 13 వేల 417కు చేరింది. ఇక కరోనా కారణంగా నిన్న 234 మంది మరణించారు. దీంతో మొత్తం కరోనా మరణాలు లక్షా 50 వేల 570కు పెరిగాయి.తాజాగా కరోనా బారి నుంచి 20 వేల 539 మంది కోలుకున్నారు. వీరితో కలిపి మొత్తం డిశ్చార్జీలు కోటీ 37 వేలకు చేరాయి. ఇక ప్రస్తుతం దేశంలో 2.25 లక్షల మంది కరోనాకు చికిత్స పొందుతున్నారు. చాలా రాష్ట్రల్లో కరోనా వైరస్ వ్యాప్తి కంట్రోల్ వచ్చినప్పటికీ.. నాలుగైదు రాష్ట్రాల్లో మాత్రం మళ్లీ కొత్త కేసులు పెరుగుతున్నాయి.