ఓవైపు వర్షాలతో జనం అల్లాడుతుంటే.. ఇంకోవైపు కరోనా కేసుల పెరుగుదల కలవరానికి గురి చేస్తోంది. చాలా రోజుల తర్వాత 20వేల మార్క్ ను దాటాయి కొత్త కేసులు. ఒక్క రోజే ఇన్ని బయటపడడంతో జనంలో ఫోర్త్ వేవ్ భయాలు మరింత పెరుగుతున్నాయి.
దేశవ్యాప్తంగా కొత్తగా 20,139 కేసులు నమోదయ్యాయి. 38 మంది కోవిడ్ బారినపడి మరణించారు. యాక్టివ్ కేసుల సంఖ్య 1,36,076కు చేరుకుంది. తాజాగా 16,482 మంది వైరస్ నుంచి కోలుకున్నారు. డైలీ పాజిటివిటీ రేటు ప్రస్తుతం 5.10 శాతానికి చేరింది.
దాదాపు 145 రోజుల తర్వాత కరోనా కేసులు 20వేల మార్కును దాటాయి. దేశవ్యాప్తంగా కరోనా వల్ల ఇప్పటి వరకు 5,25,557 మంది మరణించారు. 4,30,28,356 మంది రికవరీ అయ్యారు. మొత్తం కేసుల్లో యాక్టివ్ కేసుల సంఖ్య 0.31 శాతానికి పెరిగింది.
గత 24 గంటల్లో 13,44,714 మందికి టీకాలు అందించారు. దీంతో ఇప్పటివరకు పంపిణీ చేసిన వ్యాక్సిన్ డోసుల సంఖ్య 1,99,27,27,559కి చేరింది.