దేశంలో మరోసారి కరోనా విజృంభిస్తోంది. ఇటీవల దేశంలో కరోనా కేసుల సంఖ్య పెరుగుతోంది. వరుసగా రెండో రోజూ 21 వేలకుపైగా కొవిడ్ కేసులు నమోదయ్యాయి.
కొత్తగా 21,880 మంది మహమ్మారి బారిన పడ్డారు. దీంతో ఇప్పటి వరకు మొత్తం కరోనా కేసుల సంఖ్య 4,38,47,065కు చేరుకుంది. మొత్తం ఇప్పటి వరకు 4,31,71,653 మంది బాధితులు కరోనా నుంచి కోలుకున్నారు.
వైరస్ బారిన పడి ఇప్పటి వరకు 5,25,930 మంది ప్రాణాలు కోల్పోయారు. మరో 1,49,482 యాక్టివ్ కేసులు ఉన్నాయి. కాగా, గడిచిన 24 గంటల్లో కరోనాతో 60 మంది బలవగా, 21,219 మంది డిశ్చార్జీ అయ్యారు.
ఇటీవల కరోనా కేసుల సంఖ్య భారీగా పెరిగింది. ఈ నేపథ్యంలో రోజువారీ పాజిటివిటీ రేటు 4.25 శాతానికి చేరుకుంది. మొత్తం కేసుల్లో 0.34 కేసులు యాక్టివ్‌గా ఉన్నాయని అధికారులు తెలిపారు. ప్రస్తుతం రికవరీ రేటు 98.46 శాతం, మరణాలు 1.20 శాతంగా ఉన్నట్టు కేంద్రం ఆరోగ్య శాఖ అధికారులు పేర్కొన్నారు.