దేశంలో కరోనా విజృంభణ కొనసాగుతోంది. గత 24 గంటల్లో 14,30,891 మందికి పరీక్షలు జరపగా.. 25,404 కొత్త కేసులు బయటపడ్డాయి. 339 మంది మృతిచెందారు. ఇప్పటివరకు మొత్తం కేసులు 3.32 కోట్లు దాటగా.. మరణాల సంఖ్య 4,43,213కి పెరిగింది.
దేశంలో రికవరీ రేటు 97.58 శాతంగా ఉంది. కొత్తగా 37వేల మంది వైరస్ ను జయించారు. దీంతో ఇప్పటిదాకా వైరస్ నుంచి కోలుకున్నవారి సంఖ్య 3.24కోట్లు దాటింది. ప్రస్తుతం యాక్టివ్ కేసులు 3,62,207గా ఉన్నాయి.
మరోవైపు కరోనా కట్టడి కోసం దేశవ్యాప్తంగా వ్యాక్సినేషన్ ప్రక్రియ ముమ్మరంగా సాగుతోంది. గత 24 గంటల్లో 78,66,950 మందికి టీకా వేయగా.. ఇప్పటిదాకా 75,22,38,324 డోసుల్ని పంపిణీ చేసింది కేంద్ర ఆరోగ్యశాఖ.