దేశంలో కరోనా వైరస్ తీవ్రత స్థిరంగా కొనసాగుతోంది. ఇవాళ కూడా 50 వేలలోపు కేసులే నమోదయ్యాయి. గడిచిన 24 గంటల్లో కొత్తగా 41 వేల 322 మందికి కరోనా పాజిటివ్ నిర్దారణ అయింది. దీంతో మొత్తం కేసుల సంఖ్య 93.51 లక్షలకు చేరింది. కరోనా కారణంగా నిన్న కొత్తగా 485 మంది మృతి చెందారు. ఫలితంగా మొత్తం మరణాలు లక్షా 36 వేల 200కు పెరిగాయి.
కరోనా బారిన పడినవారిలో ఇప్పటివరకు 87.60 లక్షల మంది కోలుకున్నారు. దీంతో 4.54 లక్షల కేసులు మాత్రమే యాక్టివ్‌గా ఉన్నాయి. ప్రస్తుతం కొత్త కేసులు అధికంగా నమోదువుతున్న రాష్ట్రాల్లో మహారాష్ట్ర, కేరళ, ఢిల్లీ ఉన్నాయి.దేశవ్యాప్తంగా ఇప్పటివరకు 13.80 కోట్ల మందికిపైగా కరోనా టెస్టులు నిర్వహించినట్టు ఐసీఎంఆర్ తెలిపింది.