దేశంలో కరోనా వైరస్ కేసులతో పాటు మరణాలు కూడా భారీ స్థాయిలో తగ్గుముఖం పడుతున్నాయి. గడిచిన 24 గంటల్లో కొత్తగా 9,100 పాజిటివ్ కేసులు రికార్డయ్యాయి. ఇక కరోనాకు చికిత్స పొందుతున్న వారిలో నిన్న78 మంది ప్రాణాలు కోల్పోయినట్టు కేంద్ర కుటుంబ, ఆరోగ్య శాఖ తెలిపింది. మరో 14,016 మంది డిశ్చార్జి అయినట్టు వెల్లడించింది.
తాజాగా నమోదైన కేసులతో దేశంలో మొత్తం బాధితుల సంఖ్య 1,08,47,304కు పెరిగింది. ఇందులో ఇప్పటికే 1,05,48,521 మంది కోలుకున్నారు. ఇక ఇప్పటివరకు కరోనాతో మృతి చెందిన వారి సంఖ్య 1,55,158కి పెరిగింది. ప్రస్తుతం దేశంలో 1,43,625 యాక్టివ్ కేసులు ఉన్నాయి. అటు వ్యాక్సినేషన్‌లో భాగంగా ఇప్పటి వరకు 62,59,008 మందికి కరోనా వ్యాక్సిన్ వేసినట్లు కేంద్ర ఆరోగ్యశాఖ వివరించింది.
ఇదిలా ఉంటే దేశంలో కరోనా నిర్దారణ పరీక్షలు 20 కోట్లకు చేరుకున్నాయి. నిన్న దేశవ్యాప్తంగా 6,87,138 టెస్టులు చేసినట్లు ఐసీఎంఆర్ తెలిపింది. ఇప్పటి వరకు మొత్తం 20,58,87,752 శాంపిల్స్ పరీక్షించినట్టు వెల్లడించింది.