దేశవ్యాప్తంగా కరోనా వైరస్ వ్యాప్తి స్థిరంగానే కొనసాగుతోంది. గడిచిన 24 గంటల్లో కొత్తగా 18,645 మంది వైరస్ బారినపడ్డారు. అలాగా కరోనాకు చికిత్స పొందుతూ మరో 201 మంది ప్రాణాలు కోల్పోయారు. ఇక తాజాగా 19,299 మంది డిశ్చార్జ్ అయ్యారు.
దేశంలో ఇప్పటివరకు 1,04,50,284 మందికి కరోనా సోకింది. వైరస్ ప్రభావానికి గురై లక్షా 50 వేల 999 మంది మృత్యువాతపడ్డారు. ప్రస్తుతం 2 లక్షల 23 వేల 335 మంది కరోనాకు చికిత్స పొందుతన్నట్టు కేంద్ర వైద్యారోగ్యశాఖ తెలిపింది.