కరోనా వ్యాక్సిన్ వచ్చేస్తుండటంతో ప్రపంచ దేశాలన్నీ అలర్ట్ అవుతున్నాయి. తమ దేశంలో వ్యాక్సిన్ ఎలా ఇవ్వాలి, ఏ కంపెనీతో టై అప్ కావాలి, ఏయే రంగాలకు ప్రాధాన్యత ఇవ్వాలన్న అంశాలపై సుదీర్ఘ సమావేశాలు నిర్వహిస్తున్నాయి. భారత్ లో సైతం కరోనా వ్యాక్సిన్ వచ్చాక రోడ్ మ్యాప్ ఇప్పటికే సిద్ధం అవుతుంది.
దేశంలో కరోనా వ్యాక్సిన్ అందుబాటులోకి రాగానే మొదట ఆరోగ్య కార్యకర్తలకే ప్రభుత్వం ప్రాధాన్యమివ్వనున్నారు. అన్ని రాష్ట్రాల్లోని 92 శాతం ప్రభుత్వ, 55 శాతం ప్రైవేటు ఆసుపత్రులకు సంబంధించి రాష్ట్రాలు అందించిన డేటా ప్రకారం కోటి మంది సిబ్బందికి తొలి టీకా అందించనున్నట్లు కేంద్ర వైద్యారోగ్యశాఖ వర్గాలు తెలిపాయి.
ఇప్పటికే వైద్యులు, వైద్య విద్యార్థులు, నర్సులు, ఆశా కార్యకర్తలతో సహా ఫ్రంట్‌లైన్ హెల్త్‌కేర్ వర్కర్స్ ను గుర్తించేందుకు అన్ని రాష్ట్రాల్లో కమిటీలు ఏర్పాటు చేసింది కేంద్రం. తొలిదశలో వ్యాక్సిన్ పంపిణీ, మానవ వనరుల ఏర్పాటు, ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. మరో వారంలో మొత్తం ప్రణాళిక సిద్ధం కానుంది.
టీకా పంపిణీపై అన్ని రాష్ట్రాల సీఎంలతో ప్రధాని వరుసగా భేటీలు కాబోతున్నారు.