భారత్, రష్యాలకు చెందిన రక్షణ మంత్రులు భేటీ అయ్యారు. ఈ సమావేశంలో ఆరు లక్షల ఏకే-203 రైఫిల్స్ ను సంయుక్తంగా తయారు చేసేందుకు ఒప్పందం కుదిరింది. ఉత్తరప్రదేశ్ అమేథీలో వీటిని తయారు చేయనున్నారు.
రెండు దేశాల మధ్య నాలుగు ఒప్పందాలు కుదిరాయి. రైఫిల్స్ తయారీతో పాటు రానున్న 10ఏళ్లు రక్షణ సహకారంపైనా మంత్రులు చర్చించారు. ఈ సందర్భంగా రాజ్ నాథ్ మాట్లాడుతూ.. రష్యాతో భారత్ కు వ్యూహాత్మక భాగస్వామ్యం ఉందన్నారు.