న్యూఇయర్ ఎఫెక్ట్ దేశంపై గట్టిగానే పడింది. కరోనా కేసుల్లో రికార్డులు మొదలయ్యాయి. ఆదివారం 27వేలకు పైగా కేసులు నమోదవ్వగా.. సోమవారం అంతకంటే 6 వేల కేసులు అదనంగా బయటపడ్డాయి. తాజాగా భారత్ లో 33,750 మంది వైరస్ బారిన పడినట్లు కేంద్ర ఆరోగ్యశాఖ ప్రకటించింది.
గడిచిన 24 గంటల్లో కరోనాతో 123 మంది చనిపోగా.. ఇప్పటివరకు మృతి చెందినవారి సంఖ్య 4,81,893కి పెరిగింది. కొత్తగా 10,846 మంది వైరస్ నుంచి కోలుకోగా.. దేశంలో యాక్టివ్ కేసుల సంఖ్య 1,45,582 గా ఉంది.