సంక్షోభంతో కొట్టుమిట్టాడుతున్న శ్రీలంకకు భారత్ మరోసారి తన సహాయాన్ని అందించింది. శ్రీలంకకు మొత్తం 76000 టన్నుల ఇంధనాన్ని సరఫరా చేసింది. ఇందులో 36000 టన్నుల పెట్రోల్, 40000 టన్నుల డీజిల్ ఉంది.
ఈ విషయాన్ని శ్రీలంకలోని భారత హైకమిషన్ బుధవారం వెల్లడించింది. అంతకు ముందు గత వారం కూడా శ్రీలంకకు భారత్ ఇంధన సాయం చేసింది.
గతవారం 40000 మెట్రిక్ టన్నుల డీజిల్ కన్ సైన్ మెంట్ ను శ్రీలంకకు భారత్ అందజేసింది. శ్రీలంకకు భారత్ ఇంధన సహాయం చేయడం ఇది నాలుగో సారి కావడం గమనార్హం.
ఇప్పటి వరకు 270,000 టన్నుల ఇంధనాన్ని సహాయంగా శ్రీలంకకు భారత్ ఇచ్చింది. ఇటీవల 1 బిలియన్ డాలర్ల రుణాన్ని కూడా శ్రీలంకకు భారత్ ఇచ్చింది.