భారత్ లో ఇప్పటికే రెండు కరోనా వ్యాక్సిన్లు అందుబాటులో ఉన్నాయి. జనవరి 16 నుండి వ్యాక్సినేషన్ కూడా ప్రారంభంకానున్న దశలో… భారత్ లో ఎక్కువ మందికి వీలైనంత త్వరగా వ్యాక్సిన్ తెచ్చేందుకు అవకాశం ఏర్పడింది. భారత్ లో మరో 4 కంపెనీల వ్యాక్సిన్లు అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది.
ఇప్పటికే అస్ట్రాజెనికా కోవిషీల్డ్, భారత్ బయోటెక్ కోవాక్జిన్ వ్యాక్సిన్లతో పాటు జైడస్ క్యాడిలా, రష్యా స్పుత్నిక్ వ్యాక్సిన్, బయోలాజికల్ ఈ, జెన్నోవా కంపెనీలు తయారు చేస్తున్న వ్యాక్సిన్లు త్వరలో అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది. రష్యన్ వ్యాక్సిన్ రెండో ఫేజ్ క్లినికల్ దశలో ఉండగా, జైడస్ క్యాడిలా ఫేజ్-3 ట్రయల్స్ లో ఉన్నాయి.
ఈ వ్యాక్సిన్లు ఇతర దేశాల్లో కూడా క్లినికల్ ట్రయల్స్ కూడా నిర్వహిస్తున్నందున… వీలైనంత త్వరగానే అత్యవసర వ్యాక్సినేషన్ కు అవకాశం ఉండొచ్చని కేంద్ర వైద్యారోగ్యశాఖ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఈ వ్యాక్సిన్లు కూడా సమర్థవంతంగా, సేఫ్ గా పనిచేస్తాయని భావిస్తే… రెగ్యూలేటరీ సంస్థలు అనుమతులు ఇచ్చే అవకాశం ఉంది.