పాకిస్తాన్ ప్రధాని వ్యాఖ్యలపై భారత్ ఘాటుగా స్పందించింది. పాకిస్తాన్ వ్యాఖ్యలు, ప్రకటనలను గమనించామని భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ పేర్కొంది.
మైనారిటీల హక్కులకు పదే పదే భంగం కలిగిస్తున్న ఉల్లంఘనదారుల మాటలను ఎవరూ పట్టించుకోరని విదేశాంగ శాఖ ప్రతినిధి అరిందమ్ బాగ్చీ అన్నారు.హిందువులు, సిక్కులు, క్రైస్తవులు, మహ్మదీ, ఇతర మైనార్టీలపై పాక్ హింసకు పాల్పడటాన్నిమొత్తం ప్రపంచం కళ్లారా చూసిందన్నారు.పాక్ ప్రధాని వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నామని తెలిపారు.
అన్నిమతాలకు భారత్ అత్యున్నతమైన గౌరవాన్నిఇస్తుందని ఆయన పేర్కొన్నారు.కానీ దానికి విరుద్దంగా ఛాందస వాద ప్రకటనలను పాక్ చేస్తోందని మండిపడ్డారు.
భారత్ లో మత సామరస్యాన్ని చెడగొట్టేందుకు గాను పాక్ ఎలాంటి తప్పుడు ప్రచారాలు చేయకుండా ఉండాలన్నారు. పాక్ తమ దేశంలోని మైనార్టీల భద్రతపై దృష్టి సారించాలని సూచనలు చేశారు.