అమెరికాలో ఇటీవల చైనా స్పై బెలూన్లు కలకలం రేపాయి. వాటిని అమెరికా అధికారులు కూల్చి వేశారు. ఇండియాపై కూడా చైనా నిఘా పెట్టినట్టు ఇటీవల ఓ నివేదిక వెల్లడించింది. ఈ క్రమంలో గతేడాది బంగాళ ఖాత దీవులపై విచిత్ర వస్తువు ఒకటి ఆకాశంలో ఎగిరినట్టు తాజాగా వార్తలు వస్తున్నాయి. దీంతో కలకం రేగుతోంది.
సింగపూర్‌కు సమీపంలోని దీవుల సమూహంపై ఫ్లయింగ్ ఆబ్జెక్ట్‌ను గుర్తించినట్టు నివేదిక పేర్కొంది. ఆ వస్తువు వింతగా కనిపించడంతో అండమాన్, నికోబార్ దీవుల్లోని ఉన్న చాలా మంది ప్రజలు దాన్ని ఫోటో తీశారు. ఆ వస్తువు ఏంటో వారికి తెలియక పోయినా ఆశ్చర్యంతో వారంతా ఫోటోలు తీసినట్టు నివేదిక వెల్లడించింది.
ఈ క్రమంలో రక్షణ శాఖ అధికారులు అలర్ట్ అయ్యారు. బంగాళాఖాతంలోని మలక్కా జలసంధి ప్రాంతంలో క్షిపణి ప్రయోగాల కేంద్రానికి సమీపంలో ఆ వస్తువు ఎగిరినట్టు తేల్చారు. అమెరికాలో స్పై బెలూన్ల వార్తల నేపథ్యంలో దీన్ని రక్షణ శాఖ అధికారులు సీరియస్ తీసుకున్నట్టు తెలుస్తోంది.
మరోసారి అలాంటి వస్తువు కనిపిస్తే ఎలాంటి చర్యలు తీసుకోవాలనేదానిపై ఉన్నతాధికారులు చర్చిస్తున్నట్టు సమాచారం. అయితే ఆ వస్తువు భారతీయ రాడార్లను దాటు కుని దీవుల వైపు వచ్చిందని, దానిపై అధికారులు నిర్ణయం తీసుకునే లోపే అది దిశ మార్చుకుని వెళ్లిపోయినట్టు గుర్తించారు.
బంగాళఖాత దీవులపై ఎగిరిన వింత వస్తువు… !