అమెరికా పరిశోధనా సంస్థ హిండెన్‌బర్గ్ నివేదిక నేపథ్యంలో ఆదానీ గ్రూప్ షేర్లు భారీగా పడిపోతున్నాయి. ఆదానీ కంపెనీల్లో నాన్ ప్రమోటర్ దేశీయ షేర్ హోల్డర్‌గా ఉన్న ఎల్ఐసీకి రూ. 16,627 కోట్ల నష్టం వచ్చినట్టు మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి.
ఇలాంటి ఆందోళనకర పరిస్థితుల్లోనూ ఆదానీ కంపెనీల్లో ఎల్ఐసీ భారీగా పెట్టుబడులు పెట్టినట్టు వార్తలు వస్తున్నాయి. ఆదానీ ఎంటర్ ప్రైజేస్ నూతనంగా విక్రయిస్తున్న షేర్లలో యాంకర్ ఇన్వెస్టర్లుగా ఎల్ఐసీ 3 బిలియన్ల రూపాయలను ఖర్చు చేస్తోందని తెలుస్తోంది.
ఇప్పటికే ఉన్న 4.23శాతం షేర్లకు ఈ పెట్టబడి అదనంగా చేరుతోందని కంపెనీ దాఖలు చేసిన పత్రాల్లో తెలిపింది. ఎల్ఐసీ తాజాగా నిధులు అందించడం ఆదానీపై సంస్థ విశ్వాసాన్ని ప్రతిబింబిస్తున్నాయని మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి.
ఎల్‌ఐసి పెట్టుబడి పెడుతున్న మొత్తం చాలా చిన్నది. అయినప్పటికీ ఇతర కంపెనీలతో పోలిస్తే ఎల్ఐసీ భిన్నంగా ముందుకు వెళుతున్నట్టు కనిపిస్తోంది. ఈ విషయంలో ఎల్ఐసీ విరుద్దంగా ముందుకు వెళుతున్నట్టు కేజ్రీవాల్ రీసెర్చ్ అండ్ ఇన్వెస్ట్ మెంట్ సంస్థ వ్యవస్థాపకులు అరుణ్ కేజ్రీవాల్ పేర్కొన్నారు.