రాయితీపై రష్యా ఇస్తున్న ముడి చమురు ఆఫర్ ను భారత్ అంగీకరించడం అమెరికా ఆంక్షలను ఉల్లంఘించినట్టు కాదని వైట్ హౌస్ సెక్రటరీ జెన్ సాకీ తెలిపారు.
కానీ అలాంటి నిర్ణయాలు అతి పెద్ద ప్రజాస్వామ్య దేశాన్ని(భారత్)ను చరిత్రలో తప్పు వైపు నిలబెడుతాయని పేర్కొన్నారు. రష్యా ముడిచమురు ఆఫర్ ను భారత్ అంగీకరించే అవకాశం ఉందన్న వార్తలపై మీడియా అడిగిన ప్రశ్నపై ఈ మేరకు ఆమె స్పందించారు.
ఆ నిర్ణయం ఆంక్షలను ఉల్లంఘించినట్టుగా తాము భావించడం లేదన్నారు. కానీ అదే సమయంలో ఎవరి వైపు నిలవాలో భారత్ నిర్ణయించుకోవాలని ఆమె అన్నారు.
రష్యాకు మద్దతు ఇవ్వడమనేది దాని దండయాత్రకు మద్దతు నివ్వడమే. ఖచ్చితంగా అలాంటి నిర్ణయం వినాశకరమైన ప్రభావాన్ని చూపుతుంది ”అని ఆమె తెలిపారు.