మొదటి టెస్టులో పేలవ ప్రదర్శనతో ఓటమి మూటగట్టుకున్న భారత్… రెండో టెస్టులో మూడు మార్పులతో బరిలోకి దిగింది. టాస్ గెలిచి బ్యాంటింగ్ తీసుకున్న కోహ్లి … ఎట్టకేలకు స్పిన్నర్ నదీప్ పై వేటు వేశాడు. అతని స్థానంలో కుల్దీప్ ను తీసుకోగా… బ్యాటింగ్ లో మెరుపులు మెరిపిస్తున్న వాషింగ్టన్ సుందర్, ఫాస్ట్ బౌలర్ బుమ్రాకు రెస్ట్ ఇచ్చాడు. వీరి స్థానంలో అక్షర్ పటేల్, మహ్మద్ సిరాజ్ కు అవకాశం ఇచ్చారు.
మరోవైపు తామే ఊహించని విజయాన్ని అందుకున్న ఇంగ్లాండ్ టీం ఎలాంటి మార్పులు లేకుండానే బరిలోకి దిగింది. దాదాపు ఏడాది తర్వాత భారత్ లో అభిమానుల మధ్య ఈ మ్యాచ్ జరగనుంది. కోవిడ్ నిబంధనలు పాటిస్తూ… 50శాతం కెపాసిటీతో మ్యాచ్ కు అభిమానులను అనుమతించారు.