కరోనా కట్టడిలో బాగంగా దేశవ్యాప్తంగా టీకా ప్రక్రియ కొనసాగుతోంది. ఆరోగ్య కార్యకర్తలు దేశంలోని అందరికీ టీకాలు అందించేందుకు శ్రమిస్తున్నారు. ఈ క్రమంలోనే మరో రికార్డ్ నమోదైంది. శుక్రవారంతో దేశవ్యాప్తంగా 150కోట్ల డోసుల పంపిణీ పూర్తయింది. ఈ విషయాన్ని కేంద్రమంత్రి మన్సుఖ్ మాండవీయ తెలిపారు.
‘‘నరేంద్ర మోడీ ప్రభుత్వ విజయవంతమైన నాయకత్వం, ఆరోగ్య కార్యకర్తల కృషి కారణంగా భారత్ 150 కోట్ల కరోనా వ్యాక్సిన్ల మార్క్ ను చేరుకుంది. అందరూ కలిసి ప్రయత్నం చేస్తే ఏ లక్ష్యమైనా సాధించవచ్చు’’ అంటూ ట్వీట్ చేశారు మాండవీయ.
ऐतिहासिक प्रयास,
ऐतिहासिक उपलब्धिPM @NarendraModi जी के यशस्वी नेतृत्व व स्वास्थ्य कर्मियों की अविरल मेहनत से देश ने आज 150 करोड़ कोरोना वैक्सीन लगाने का ऐतिहासिक आँकड़ा पार कर लिया है। जब सब मिलकर 'प्रयास' करते हैं तो कोई भी लक्ष्य हासिल किया जा सकता है।#SamarthyaKe150crore pic.twitter.com/BBKvpLTgTb
— Dr Mansukh Mandaviya (@mansukhmandviya) January 7, 2022
Advertisements
150 కోట్ల కరోనా వ్యాక్సిన్ డోసుల పంపిణీపై ప్రధాని మోడీ ప్రశంసలు కురిపించారు. పేదలకు వైద్యపరమైన ప్రయోజనాలను అందించేందుకు కేంద్రం కట్టుబడి ఉందన్నారు. కోల్ కతాలోని చిత్తరంజన్ నేషనల్ క్యాన్సర్ ఇన్స్ స్టిట్యూట్ రెండో క్యాంపస్ ను వర్చువల్ గా ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ప్రసంగిస్తూ.. ఈ విజయం భారత్ ఆత్మవిశ్వాసం, ఆత్మనిర్భరత, ఆత్మగౌరవాన్ని ప్రతిబింబిస్తుందని చెప్పారు.
దేశంలో 90 శాతానికిపైగా కరోనా తొలి డోసు పూర్తయిందన్నారు మోడీ. కేవలం 5రోజుల్లోనే 15 నుంచి 17ఏళ్ల కోటిన్నరకు పైగా పిల్లలకు మొదటి టీకా వేసినట్లు వివరించారు. ఆయుష్మాన్ పథకం ద్వారా దేశవ్యాప్తంగా 2.60కోట్ల మంది ప్రజలకు లబ్ధి చేకూరుతుందన్న ప్రధాని… అందులో 17లక్షల మంది క్యాన్సర్ బాధితులు ఉన్నట్లు తెలిపారు.