దేశంలో మరో 54 చైనా యాప్ లను కేంద్రం నిషేధించనున్నట్టు తెలుస్తోంది. దేశ భద్రతకు ముప్పు ఉందన్న నేపథ్యంలో వీటిపై నిషేధం విధించే యోచనలో కేంద్ర ప్రభుత్వం ఉన్నట్టు అధికార వర్గాలు వెల్లడించాయి.
ఈ జాబితాలో స్వీట్ సెల్ఫీ హెచ్ డీ, బ్యూటీ కెమెరా, సెల్ఫీ కెమెరా, వీవా వీడియో ఎడిటర్, టెన్ సెంట్ రైవర్, ఆన్ మ్యోజీ అరేనా, యాప్ లాక్, డ్యుయల్ స్పేస్ లైట్ లు ఉన్నట్టు సమాచారం.
గతేడాది చైనాకు చెందిన 59 యాప్ లను భారత ప్రభుత్వం నిషేధించింది. దేశ భద్రతకు భంగం వాటిల్లే అవకాశం ఉందన్న సమాచారం మేరకు వీటిపై కేంద్రం నిషేధం విధించింది. వీటిలో టిక్ టాక్, వీ చాట్, హలో లాంటి ప్రముఖ సోషల్ మీడియా యాప్ లు ఉన్నాయి.
చైనాతో సరిహద్దుల వద్ద ఉద్రిక్తతల నేపథ్యంలో మే 2020 నుంచి ఇప్పటి వరకు సుమారు 300 యాప్ లను కేంద్రం బ్యాన్ చేసింది. మొదటి సారిగా గాల్వాన్ లోయ వద్ద 20 మంది బారత సైనికులు మరణించిన తర్వాత మొదటి సారిగా బ్యాన్ విధించారు.