తియ్యని చక్కెరతో ఇండియా తీపెక్కిపోయింది. ప్రపంచంలోనే చక్కెర ఉత్పత్తిలో టాప్ స్థానంలో నిలిచింది. ఇటీవలే ముగిసిన షుగర్ మార్కెటింగ్ సీజన్ లో లో దీని ఎగుమతులు బ్రహ్మాండంగా ఉన్నాయని ప్రభుత్వం నిన్న విడుదల చేసిన అధికారిక డేటాలో వెల్లడించింది. బ్రెజిల్ తరువాత ఇండియా ఇప్పుడు ఈ విషయంలో సెకండ్ ప్లేస్ ఆక్రమించింది.
2021-22.. అక్టోబర్-సెప్టెంబర్ మధ్యకాలంలో షుగర్ సీజన్ ‘కళకళలాడింది’. 1.1 కోట్ల టన్నుల ఉత్పత్తి సాధించినట్టు ఈ డేటా పేర్కొంది. ఇది గత సంవత్సరంతో పోలిస్తే 58 శాతం ఎక్కువట. దీంతో 40 వేల కోట్ల విదేశీమారక ద్రవ్యం వచ్చి పడింది. అలాగే ఎగుమతులు 28 శాతం ఉన్నాయట.
2019 లో ఇండియా అతి పెద్ద పంచదార ఉత్పాదక దేశమని ఇంటర్నేషనల్ షుగర్ ఆర్గనైజేషన్ తెలిపింది. ఆ ఏడాది దీని ఔట్ ఫుట్ 2. 97 కోట్ల టన్నులని వెల్లడైంది. అప్పుడు బ్రెజిల్ మాత్రం 2.92 కోట్ల టన్నుల చక్కెరను ఉత్పత్తి చేయగలిగింది. కానీ కొన్నేళ్లుగా ఈ దేశం వాల్డ్ లోనే టాప్ ప్లేస్ ఆక్రమిస్తూ వచ్చింది.
ఎగుమతుల విషయంలో ఇప్పుడు ఇండియా క్రమంగా ఎదిగిపోతోంది. బంపర్ ప్రొడక్షన్ లో తనకు తానే సాటి అని నిరూపించుకుంటోంది. 2017-18 లో దేశం నుంచి చక్కర ఎగుమతులు 11 రెట్లు పెరిగాయి. ఆ ఏడాదిలో ఇవి 6.2 లక్షల టన్నులు ఉండగా 2020-21 నాటికి ఇది 70 లక్షల టన్నులట. ఇండియన్ షుగర్ రంగానికి ఇది భేషైన కాలమని పరిశ్రమ వర్గాలు చెబుతున్నాయి. అలాగే చెరకు రైతుల పంట కూడా పండింది. 2020-21 సంవత్సరాంతానికి వీరికి చెల్లించాల్సిన బకాయిలు సుమారు 6 వేల కోట్లు మాత్రమేనని ఆహార శాఖ తెలిపింది. మొత్తం చెల్లించాల్సిన 1.2 లక్షల కోట్లలో మిల్లులు వీరికి రూ. 1.1 లక్ష కోట్లు చెల్లించినట్టు ఈ శాఖ పేర్కొంది.