దేశంలో కరోనా వైరస్ కేసులు భారీగా పెరిగాయి. మరోసారి రికార్డు స్థాయిలో నమోదైయ్యాయి. తాజాగా 70 వేలకు చేరువలో కేసులు వెలుగు చూశాయి.
గడిచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా కొత్తగా 68,020 కరోనా కేసులు నమోదయ్యాయి. ఈ ఏడాది ఈ స్థాయిలో కేసులు నమోదు కావడం ఇదే రికార్డ్. ఇక కరోనాకు చికిత్స పొందుతూ దేశవ్యాప్తంగా 291 మంది ప్రాణాలు కోల్పోయినట్టు కేంద్ర ఆరోగ్యశాఖ తెలిపింది. ఇదిలా ఉంటే కొత్త కేసులకు తగ్గట్టుగా రికవరీలు మాత్రం కనిపించడం లేదు. నిన్న 32,231 మంది డిశ్చార్జి అయ్యారు.
దేశంలో ఇప్పటివరకూ నమోదైన కేసులుః 1,20,39,644
కరోనా నుంచి కోలుకున్నవారుః 1,13,55,993
యాక్టివ్ కేసులుః 5,21,808
కరోనాతో ఇప్పటివరకూ మరణాలుః 1,61,843
కరోనా వ్యాక్సిన్ తీసుకున్నవారుః 6,05,30,435