దేశంలో కరోనా నిర్దారణ పరీక్షల సంఖ్య భారీగా పెరుగుతోంది. నేటి వరకు దేశవ్యాప్తంగా రెండు కోట్లకుపైగా పరీక్షలు నిర్వహించినట్టు ICMR ప్రకటించింది. నిన్న నిర్వహించిన 4 లక్షల 63 వేల 172 పరీక్షలతో ఇవాళ్టి ఉదయం 8 గంటల వరకు దేశవ్యాప్తంగా కరోనా టెస్టుల సంఖ్య కోటీ 98 లక్షల 21 వేల 831కు చేరింది. ప్రస్తుతం ఆ సంఖ్య రెండు కోట్ల మార్క్ దాటి ఉంటుందని ICMR అంచనా వేసింది.
ప్రస్తుతం దేశవ్యాప్తంగా 1344 ల్యాబుల్లో కరోనా శాంపిళ్ల పరీక్షలు జరుగుతున్నాయి. ఇందులో 913 ప్రభుత్వ లాబ్స్,431 ప్రైవేట్ లాబ్స్ ఉన్నాయి. ప్రస్తుతం 4 నుంచి 6 లక్షల వరకు రోజువారీగా కరోనా పరీక్షలు నిర్వహిస్తున్నారు. దీన్ని 10 లక్షలకు పెంచాలని ప్రయత్నిస్తున్నారు.
కాగా దేశంలో తొలి కరోనా కేసు జనవరి 30న కేరళలో నమోదైంది. చైనాలోని వ్యూహాన్‌లో వైద్య విద్యను అభ్యసిస్తున్న విద్యార్థిని.. కేరళకు వచ్చాక.. కరోనా లక్షణాలతో బాధపడింది. టెస్టులు నిర్వహించగా..ఆ విద్యార్థికి వైరస్ సోకినట్లు తేలింది.