కరోనా వ్యాక్సినేషన్ డ్రైవ్లో భారత్ సరికొత్త రికార్డు నెలకొల్పింది. ఒక్కరోజులోనే 30లక్షల 39వేల 394 మందికి వ్యాక్సిన్ అందించి.. ఈ ఘనత సాధించిన తొలిదేశంగా పేర్కొంది. వ్యాక్సిన్ ప్రారంభించిన 59వ రోజు అంట మార్చి 15న చేపట్టిన వ్యాక్సినేషన్ డ్రైవ్ ద్వారా ఈ ఘనత సాధించినట్టు కేంద్ర వైద్యారోగ్యశాఖ తెలిపింది.
దీంతో దేశంలో ఇప్పటి వరకు వ్యాక్సిన్ పొందిన లబ్ధిదారుల సంఖ్య 3 కోట్ల 29 లక్షల 47వేల 432 దాటింది. ఇప్పటివరకు 5లక్షల 55వేలకుపైగా సెషన్లు నిర్వహించారు. వ్యాక్సిన్ లబ్ధిదారుల్లో సుమారు కోటి మందికిపైగా 60ఏళ్ల పైబడిన వారే ఉన్నారని కేంద్రం వివరించింది.
దేశంలో కరోనా వైరస్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో… వ్యాక్సిన్ వేసుకోవాలని, వ్యాక్సిన్ పై అపోహలు అవసరం లేదని కేంద్రం విజ్ఞప్తి చేస్తోంది.