ఇండియాలో కరోనా కేసుల సంఖ్య తగ్గుముఖం పడుతున్పప్పటికీ, వ్యాక్సినేషన్ ప్రక్రియ కొనసాగుతుంది. అయితే, వివిధ కారణాల వల్ల వ్యాక్సిన్స్ వృధా అవుతున్నట్లు కేంద్రం ప్రకటించింది.
రిజిస్ట్రేషన్ చేయించుకున్న వారిలో ప్రతి రోజు ఎంతమందికి వ్యాక్సిన్ వేయాలన్న చార్ట్ తో సిబ్బంది రెడీ అవుతున్నారు. కానీ అందులో కొందరు వ్యాక్సిన్ వేయించుకోవటం లేదు. దాంతో వారి డోస్ వృధా అవుతుందని, ఇలా దేశంలో ఇప్పటి వరకు దాదాపు 13వేల డోసులు వృధా అయ్యాయని కేంద్ర వైద్యారోగ్యశాఖ ప్రధాన కార్యదర్శి జె.రాధాకృష్ణన్ తెలిపారు.
రాష్ట్రంలో గత జనవరి 16వ తేదీ నుంచి కరోనా టీకాలు వేసే ప్రక్రియ ప్రారంభించామని, ఆ రోజున టీకా వేసుకున్న 3 వేల మందికి శనివారం నుండి రెండో డోస్ వేయిస్తున్నామన్నారు.