తెలుగు ప్రజలందరికీ ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేశారు. చెన్నైలో కుటుంబ సభ్యులతో కలిసి ఆయన భోగీ వేడుకల్లో పాల్గొన్నారు. ఈ సందర్బంగా వెంకయ్య నాయుడు మాట్లాడుతూ.. ఈ సంక్రాంతి రైతులందరికీ శుభాలు చేకూర్చాలన్నారు. అచ్చమైన తెలుగుదనం ఉట్టిపడేలా వ్యవహరించే వెంకయ్య నాయుడు తాజాగా ఈ పండుగ యొక్క ప్రాధాన్యతను వివరించారు. భోగి పండుగ అంటే మంచిని ఆహ్వానించి చెడును వదిలి పెట్టడమని.. సంక్రాంతి అంటే పెద్దలను స్మరించుకుని వారు చూపిన మార్గాన్ని అనుసరించడమని పేర్కొన్నారు. కనుమ పండగ అంటే ప్రకృతిని ప్రేమించడం, పశుపక్ష్యాదులను పూజించడమని ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు వివరించారు.