ఆసీస్‌తో జరిగే మూడో, నాలుగవ టెస్టులకు, మూడు వన్డేల సిరీస్ లకు భారత జట్టును తాజాగా బీసీసీఐ ప్రకటించింది. టీమ్ ఇండియా, ఆస్ట్రేలియా జట్ల మధ్య మూడో టెస్టు ఇండోర్‌లో మార్చి 1 నుంచి 5 వరకు జరగనుండగా, నాలుగో టెస్టు మార్చి 9 నుంచి 13వరకు ఆహ్మదాబాద్‌లో జరగనుంది.
మొదటి వన్డేలకు వ్యక్తిగత కారణాలతో హిట్ మ్యాన్ రోహిత్ శర్మ దూరం అవుతున్నట్టు తెలుస్తోంది. దీంతో తొలి వన్డేకు హార్థిక్ పాండ్య కెప్టెగా వ్యవహరించనున్నారు. షెడ్యూల్ ప్రకారం టీమిండియా కంగారుల మధ్య మొదటి వన్డే మార్చి 17న ముంబైలో జరగనుంది. విశాఖపట్నం వేదికగా మార్చి 19న రెండో మ్యాచ్, చెన్నైలో మూడో వన్డే మార్చి 22న నిర్వహించనున్నారు.
భారత టెస్టు జట్టు: రోహిత్ శర్మ(కెప్టెన్), శుభ్‌మన్ గిల్, ఛెతేశ్వర్ పుజారా, కేఎల్ రాహుల్, విరాట్ కోహ్లీ, కేఎస్ భరత్(కీపర్), ఇషాన్ కిషన్(కీపర్),అక్షర్ పటేల్, అశ్విన్, జడేజా, కుల్దీప్ యాదవ్, సిరాజ్, షమీ, సూర్య కుమార్ యాదవ్, ఉనద్కత్, ఉమేష్ యాదవ్
భారత వన్డే జట్టు: రోహిత్ శర్మ(కెప్టెన్), విరాట్ కోహ్లీ, శుభ్‌మన్ గిల్, సూర్య కుమార్ యాదవ్, కేఎల్ రాహుల్, శ్రేయస్ అయ్యర్, ఇషాన్ కిషన్(కీపర్), హార్దిక్ పాండ్య(వీసీ), జడేజా, కుల్దీప్ యాదవ్, యజువేంద్ర చాహల్, వాషింగ్టన్ సుందర్, మహ్మద్ షమీ, ఉమ్రాన్ మాలిక్, మహ్మద్ సిరాజ్, శార్దుల్ ఠాకూర్, అక్షర్ పటేల్, జయదేవ్ ఉనద్కత్.