ముందు నుండి ఊహిస్తున్నట్లుగా ఇంగ్లాండ్ తో జరగనున్న ఐదో టెస్ట్ రద్దు అయ్యింది. మాంచెస్టర్ వేదికగా మధ్యాహ్నం 3.30గంటల నుండి స్టార్ట్ కావాల్సిన టెస్ట్ మ్యాచ్ ను రద్దు చేస్తున్నట్లు ఇంగ్లాండ్ క్రికెట్ బోర్డు అధికారికంగా ప్రకటించింది.
భారత క్రికెట్ టీంలో కోచ్ రవిశాస్త్రితో పాటు సహయక సిబ్బంది కరోనా బారిన పడ్డారు. మొత్తం ఐదుగురు సభ్యులు కరోనాతో బాధపడుతున్నందున వాయిదా అనివార్యమని రెండ్రోజులుగా కథనాలు వినిపించగా… వాయిదా అనివార్యమైందని ఇంగ్లాండ్ బోర్డు ప్రకటించింది. అయితే, మ్యాచ్ మళ్లీ ఎప్పుడు ఉంటుంది అనేది మాత్రం క్లారిటీ ఇవ్వలేదు. ఐదు టెస్టుల సిరీస్ లో ఇండియా 2-1లీడ్ లో ఉండగా, ఒక మ్యాచ్ డ్రా అయ్యింది.