కాన్పూర్లో జరుగుతున్న టెస్టు మ్యాచ్లో న్యూజిలాండ్ పట్టు బిగిస్తోంది. రెండో రోజు ఆట ముగిసే సమయానికి ఒక్క వికెట్ కూడా నష్టపోకుండా 129 పరుగులు చేసింది. లాథమ్(50), విల్ యంగ్(75) జాగ్రత్తగా ఆడుతున్నారు.
మొదటిరోజు 258 పరుగులు చేసిన భారత్ రెండోరోజు ఆటను కొనసాగించింది. కెరీర్లో మొదటి టెస్టు ఆడుతున్న శ్రేయస్ అయ్యర్(105) సెంచరీతో ఇరగదీశాడు. జడేజా(50) హాఫ్ సెంచరీతో మెరిశాడు. దీంతో 345 పరుగులు చేసి ఆలౌటైంది టీమిండియా. కివీస్ బౌలర్లలో సౌథీ ఒక్కడే 5 వికెట్లు పడగొట్టాడు.
తర్వాత బ్యాటింగ్కు దిగిన కివీస్ ఓపెనర్లు జాగ్రత్తగా ఆడుతూ.. రెండోరోజు ఆట ముగిసేసరికి ఇద్దరూ కలిసి 129 పరుగులు సాధించారు. మూడోరోజు అన్నా భారత బౌలర్లు వికెట్లు పడగొడతారా? అనేది చూడాలి.