శుక్రవారం హైదరాబాద్ వేదికగా జరగబోయే ఇండియా వెస్టిండీస్ మధ్య మ్యాచ్ కు అన్ని ఏర్పాట్లు సిద్ధం అయ్యాయి. మ్యాచ్ కి సంధించిన అన్ని ఏర్పాట్లను సీపీ మహేష్ భగవత్ పరిశీలించారు. ఈ సందర్బంగా మహేష్ భగవత్ మాట్లాడుతూ స్టేడియం లోపల,పరిసరాల లో 300 కెమెరాలు ఏర్పాటు చేసినట్టు తెలిపారు. స్టేడియం లోపల ఒక ప్రత్యేక కమాండ్ కంట్రోల్ సెంటర్ ను ఏర్పాటు చేసినట్టు చెప్పారు. మ్యాచ్ తో పాటు బ్లాక్ డే సందర్బంగా మొత్తం 1800 పోలీసులతో పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశామని, పార్కింగ్ సంబంధించిన వరకు ప్రత్యేక ఏర్పాట్లు చేశామన్నారు. అదేవిదంగా ప్రేక్షకుల దృశ్య మెట్రో రైల్ రాత్రి 1 వరకు నడపనున్నామని తెలిపారు. స్టేడియం,పిచ్ అంత ఇప్పటికే తనికీలు చేశాము. మొబైల్ ఫోన్, ఇయర్ ఫోన్స్,హెల్మెట్, పవర్ బ్యాంక్, సిగరెట్లు, లాప్టాప్ ,మద్యం ,తిండిపదార్ధాలు, వాటర్ బాటిల్ కూడా బయట నుంచి అనుమతించమని తెలిపారు. దీనిపై అన్ని ఎంట్రీ గేట్ వద్ద చెకింగ్ పాయింట్స్ ఏర్పాటు చేస్తామని మహేష్ భగవత్ తెలిపారు.