త్వరలోనే 5 ట్రిలియన్ ఎకానమీగా ఎదుగుతామని.. ప్రస్తుతం లార్జెస్ట్ ఎకానమీలో ప్రపంచలోనే ఐదో స్థానంలో ఉన్నామని..గవర్నర్ తమిళి సై ధీమా వ్యక్తం చేశారు. హైదరాబాద్ లోని రాజ్ భవన్ కమ్యూనిటీ సంస్కృతి హాల్ లో రాజ్ భవన్ పరివార్ సభ్యులకు ఏర్పాటు చేసిన ఫైనాన్షియల్ లిట్రసీ ట్రైనింగ్ కార్యక్రమం ప్రారంభమైంది.
హెచ్ డీఎఫ్ సీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన గవర్నర్ తమిళి సై.. కరోనా టైంలో ఎకనామికల్ గా ఎదగడానికి రాజ్ భవన్ లో అనేక కార్యక్రమాలు ఏర్పాటు చేశామని చెప్పారు.
సేవింగ్స్ వల్ల చాలా లాభాలున్నాయన్న గవర్నర్.. మహమ్మారి లాంటి అత్యవసర పరిస్థితులలో అవి చాలా ఉపయోగపడతాయన్నారు. చిన్నప్పుడు మనీ బాక్స్ లలో, బట్టలల్లో డబ్బులను దాచుకునే వాళ్లమని తమిళి సై గుర్తు చేసుకున్నారు.
కానీ ఇప్పుడు మనీ సేవ్ చేయడానికి చాలా ఆర్గనైజేషన్స్ వచ్చాయని తెలిపారు. మనీ లేక చాలా మంది చనిపోతున్నారన్న ఆమె.. తాను తెలంగాణ, రాజ్ భవన్ సిస్టర్ గా పరివార్ ని గైడ్ చేయడానికి ఇలాంటి ట్రైనింగ్ కార్యక్రమంతో ముందుకు వచ్చానని స్పష్టం చేశారు.