ఆస్ట్రేలియా గడ్డపై భారత కుర్రాళ్ల విశ్వరూపం చూపించారు. ఒకప్పుడు గబ్బా పిచ్ అంటేనే వణికిపోయే భారత పేరు మోసిన ఆటగాళ్లకు కుర్రాళ్లు విజయం సాధించి, సిరీస్ గెలిపించారు.
బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో భాగంగా నాలుగు టెస్టుల సిరీస్ లో భారత్, ఆస్ట్రేలియాలో చెరో విజయం సాధించాయి. మరో మ్యాచ్ డ్రాగా ముగిసింది. నిర్ణయాత్మక బ్రిస్భెన్ పిచ్ పై ఆసీస్-భారత్ హోరాహోరీ తలపడ్డాయి. ఫస్ట్ ఇన్నింగ్స్ లో ఆసీస్ పై చేయి సాధించగా, 329పరుగుల భారీ టార్గెట్ ను భారత్ చేధించి, సిరీస్ సొంతం చేసుకుంది.
లక్ష్య ఛేదనలో ఓపెనర్ శుభమన్ గిల్ కొత్త కుర్రాడైనా ఫోర్లు, సిక్సర్లు బాదడంతో టీమిండియాలో ఊపు వచ్చింది. సెంచరీ ముందు 91పరుగుల వద్ద గిల్ ఔటయ్యాడు. పుజారాకు తోడుగా… అజింక్య రహానె (24: 22 బంతుల్లో 1×4, 1×6) నెమ్మదిగా ఆడటంతో డ్రా కోసం ప్రయత్నిస్తారా అన్న అనుమానం అభిమానులను వెంటాడింది. కానీ పంత్ తన కెరీర్ లోనే అత్యుత్తమ ఆటతీరుతో ఆకట్టుకున్నాడు. టెస్టులకు పనికిరాడన్న విమర్శలకు చెక్ పెడుతూ… 89పరుగుల నాటౌట్ తో జట్టును గెలిపించాడు. దాటిగా ఆడే ప్రయత్నంలో పుజారా, మయాంక్ అగర్వాల్ (9: 15 బంతుల్లో 1×4) ఔటయ్యారు. కానీ ఫస్ట్ ఇన్నింగ్స్ హీరో వాషింగ్టన్ సుందర్ (22: 29 బంతుల్లో 2×4, 1×6)తో కలిసి చివరి సెషన్ ఆఖర్లో టీ20 తరహా ఇన్నింగ్స్ ఆడి మ్యాచును మలుపుతిప్పాడు. ఆడేశాడు. దీంతో పంత్ కు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ లభించింది.
ఈ మ్యాచ్ ద్వారా వాషింగ్టన్ సుందర్, శార్ధూల్ ఠాకూర్, సిరాజ్, నటరాజన్ కూడా తమ ప్రతిభను చాటారు.