ఇంగ్లాండ్-భారత్ మధ్య జరుగుతున్న నాలుగు టెస్టు కూడా మూడు రోజుల్లోనే ముగిసింది. భారత స్పిన్నర్ల దాటికి ఇంగ్లాండ్ చేతులెత్తేసింది. ఇన్నింగ్స్ 25 పరుగుల తేడాతో ఘోర పరాజయం పాలైంది. దీంతో సిరీస్ ను 3-1తేడాతో భారత్ కైవసం చేసుకుంది.
రెండో ఇన్నింగ్స్ లో ఇంగ్లాండ్ ఏ దశలోనూ భారత్ కు భారీ లక్ష్యాన్ని నిర్ధేశించేలా సాగలేదు. స్పిన్నర్లు అశ్విన్, అక్షర్ పటేల్ చెరో ఐదు వికెట్లు తీసి ఇంగ్లాండ్ ను కేవలం 135 పరుగులకే ఆలౌట్ చేశారు. ఫలితంగా భారత్ తొలి ఇన్నింగ్స్ ఆధిక్యాన్ని సైతం ఇంగ్లాండ్ దాటలేకపోయింది. ఇంగ్లాండ్ బ్యాట్స్ మెన్లలో డాన్ లారెన్స్ ఒక్కడే 50 పరుగులు చేశాడు.
స్కోర్ బోర్డ్-
ఇంగ్లాండ్- 205, 135
ఇండియా- 365