మిస్ యూనివర్స్ కిరీటం భారత్ కు దక్కింది. అందరూ అనుకున్నట్టే 70వ మిస్ యూనివర్స్ పోటీల్లో భారతదేశం తరపున పోటీ చేసిన హర్నాజ్ సంధు మిస్ యూనివర్స్ టైటిల్ ను గెలుచుకున్నారు. దీంతో, 20 ఏళ్ల తరువాత భారత్ కు మిస్ యూనివర్స్ టైటిల్ మళ్లీ వచ్చింది. 2000 సంవత్సరంలో లారాదత్త మిస్ యూనివర్స్ టైటిల్ దక్కించుకున్న తరువాత.. భారత్ కు అది అందని ద్రాక్షగానే మిగిలిపోయింది.
దీంతో భారతీయులంతా ఈ సారి హర్నాజ్ సంధు ఈ టైటిల్ ను దక్కించుకోవాలని బలంగా కోరుకున్నారు. దీంతో భారత్ కు ఈ కిరీటం ముచ్చటగా మూడోసారి దక్కినట్టైంది. 1994లో సుస్మితా సేన్, 2000లో లారా దత్తా, ఇప్పుడు హర్నాజ్ సంధు ఈ టైటిల్ దక్కించుకున్నారు. మిస్ యూనివర్స్ పోటీలు ఇజ్రాయిల్ లో జరిగాయి. దాదాపు 80 మంది ఈ పోటీల్లో పాల్గొన్నారు.