ఆస్ట్రేలియాతో జరుగుతున్న పింక్ బాల్ డే అండ్ నైట్ టెస్ట్ మ్యాచ్ లో ఇండియా లెక్క సరిచేసింది. మొదటి టెస్టులో భారత్ ఘోర ఓటమి చవిచూడగా… మెల్ బోర్న్ లో జరుగుతున్న రెండో టెస్టులో అద్భుత విజయం సాధించింది. నాలుగు రోజుల్లో ఆట ముగించి ఆస్ట్రేలియాకు సవాల్ విసిరింది.
ఫస్ట్ ఇన్నింగ్స్ లో ఆస్ట్రేలియాను 195 పరుగలకే ఆలౌట్ చేయగా రెండో ఇన్నింగ్స్ లో 200పరుగులకే ఆలౌట్ చేసింది. ఇక మొదటి ఇన్నింగ్స్ లో యాక్టింగ్ కెప్టెన్ రహానే సెంచరీతో ఆకట్టుకోగా… కొత్త కుర్రాళ్లు గిల్, సిరాజ్ రాణించారు. రెండో ఇన్నింగ్స్ లో ఆస్ట్రేలియా విధించిన 70 పరుగుల టార్గెట్ ను భారత్ 2 వికెట్లు కోల్పోయి అలవోకగా చేధించింది.
దీంతో నాలుగు టెస్టుల సిరీస్ 1-1తో సమం కాగా, మరో రెండు టెస్టులు ఆడాల్సి ఉంది.