భారతీయుడు 2 షూటింగ్ లొకేషన్ మార్చేస్తున్నారట..! - Tolivelugu

భారతీయుడు 2 షూటింగ్ లొకేషన్ మార్చేస్తున్నారట..!

కమల్ హాసన్ హీరోగా శంకర్ దర్శకత్వంలో వస్తున్న సినిమా భారతీయుడు 2. లాక్ డౌన్ కన్నా ముందుగానే షూటింగ్ సమయంలో జరిగిన ప్రమాదంలో ఇద్దరు చనిపోయిన సంగతి తెలిసిందే. దానితో షూటింగ్ ను తాత్కాలికంగా వాయిదా వేశారు. లాక్‌డౌన్‌ ముగిసిన తరువాత షూటింగ్ ను ప్రారంభించేందుకు సినిమా యూనిట్‌ సన్నాహాలు చేస్తోంది.

అయితే ప్రమాదం జరిగిన పూందమల్లి సమీపంలోని స్టూడియో నుంచి లొకేషన్‌ ను మారుస్తున్నట్టు సమాచారం. చెన్నై విమానాశ్రయం సమీపంలోని బిన్నీ మిల్లులో సెట్‌ వేసి చిత్రీకరణ చేయనున్నట్లు కోలీవుడ్‌ వర్గాల్లో గుసగుసలు వినిపిస్తున్నాయి‌. ఈ చిత్రంలో కమల్‌ సరసన కాజల్‌ అగర్వాల్‌ నటిస్తుంది. అప్పట్లో భారతీయుడు సినిమా మంచి విజయం సాధించిన సంగతి తెలిసిందే.

Share on facebook
Share on twitter
Share on whatsapp