సంచలన దర్శకుడు శంకర్ దర్శకత్వంలో కమల్ హాసన్ హీరోగా తెరకెక్కిన భారతీయుడు చిత్రం ఎంతటి ఘన విజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. అయితే ఈ సినిమాకు సీక్వెల్ గా భారతీయుడు 2 తెరకెక్కుతోంది. ఇక ఈ సినిమాలో కాజల్ అగర్వాల్, ప్రియా భవాని శంకర్, రకుల్, సిద్ధార్థ్ తదితరులు నటిస్తున్నారు. లైకా ప్రొడక్షన్ నిర్మాణ సంస్థ ఈ సినిమాను నిర్మిస్తోంది. ఇదిలా ఉండగా గతేడాది క్రేన్ ప్రమాదం జరిగింది. ఆ ప్రమాదంలో పలువురు మృతి చెందారు. ఇక అప్పటినుంచి షూటింగ్ కు బ్రేక్ పడింది. ఆ సమయంలో కమల్ మరో సినిమాను ఓకే చేశారు. మరోవైపు ఎన్నికలు కూడా దగ్గర పడుతున్న నేపథ్యంలో భారతీయుడు-2 ఆగిపోయిందని అందరూ భావించారు.
ఈ నేపథ్యంలోనే ఈ సినిమా షూటింగ్ ను వచ్చే నెల నుండి ప్రారంభించేందుకు చిత్ర యూనిట్ సిద్ధమవుతున్నట్లు సమాచారం. అయితే మొదట హీరోయిన్ లు ఇతర నటులకు ఉన్న సన్నివేశాలను పూర్తి చేయాలని ఎన్నికల తర్వాత కమల్ షెడ్యూల్ ప్లాన్ చేస్తున్నారట. అయితే దీనిపై అధికారిక ప్రకటన మాత్రం రాలేదు.