అమెరికాలోని మేరిల్యాండ్ రాష్ట్రానికి లెఫ్టినెంట్ గవర్నర్‌గా అరుణామిల్లర్ ప్రమాణ స్వీకారం చేశారు. ఈ రాష్ట్రానికి ఎన్నికైన తొలి భారతీయ-అమెరికన్ రాజకీయ నాయకురాలిగా ఆమె నవంబర్‌లో చరిత్ర సృష్టించారు. ఆమె హైదరాబాద్ నగరంలో పుట్టారు.
లెఫ్టినెంట్ గవర్నర్‌గా ప్రమాణ స్వీకారం అనంతరం ఆమె మాట్లాడుతూ… తన కుటుంబ సభ్యులను గుర్తు చేసుకున్నారు. వారి కృషి, ప్రోత్సాహంతోనే తాను ఈ విజయాలను అందుకున్నట్టు చెప్పుకొచ్చారు. మొదట తన తండ్రి 1960లో అమెరికాకు వచ్చారన్నారు.
1960లో అమెరికాలో చదువుకున్నారని చెప్పారు. అనంతరం 1972లో తమ కుటుంబం మొత్తం అమెరికాకు వచ్చిందని పేర్కొన్నారు. ఆ సమయంలో తనకు ఏడేండ్లు అని వివరించారు. అరుణా ఓ ట్రాన్స్ పోర్టు ఇంజినీర్ గా తన కెరీర్ ప్రారంభించారు.
2010 నుంచి 18 వరకు మేరీలాండ్ హౌస్ ఆఫ్ డెలిగేట్స్ లో రెండు సార్లు సభ్యురాలిగా పని చేశారు. గత నవంబర్ లో జరిగిన ఎన్నికల్లో రిపబ్లిక్ పార్టీ టికెట్ పై ఆమె బరిలోకి దిగారు. ఎన్నికల్లో గెలిచి ఈ రాష్ట్రానికి లెఫ్టినెంట్ గవర్నర్ గా ఎన్నికైన తొలి భారతీయ సంతతి వ్యక్తిగా రికార్డుల్లోకెక్కారు.