భారత సైన్యానికి చెందిన హెలికాప్టర్ ఒకటి అరుణాచల్ ప్రదేశ్ లో కుప్పకూలింది. పశ్చిమ కామెంగ్ జిల్లా మండాల సమీపంలో హెలి కాప్టర్ క్రాష్ అయింది. ఈ రోజు ఉదయం ఈ ఘటన చోటు చేసుకుంది. ఈ ఘటనలో పైలట్, కో పైలట్ మృతి చెందారు.
మృతులను లెఫ్టినెంట్ కల్నల్ వీవీబీ రెడ్డి, మేజర్ జయంత్‌గా గుర్తించారు. రోజు వారి విధుల్లో భాగంగా సెంగే గ్రామం నుంచి హెలికాప్టర్ అసోం బయలు దేరింది. బయలు దేరిన కొద్ది సయయం తర్వాత ఎయిర్ ట్రాఫిక్ కంట్రోలర్ తో హెలికాప్టర్ కు ఉదయం 9 .15 గంటల తర్వాత సంబంధాలు తెగిపోయాయి.
ఆ తర్వాత హెలికాప్టర్ మిస్సింగ్ అయినట్టు అధికారులు వెల్లడించారు. దీంతో ఇండియన్ ఆర్మీ, శశస్త్ర సీమాబల్, ఐటీబీపీకి చెందిన ఐదు పార్టీలు సెర్చ్ ఆపరేషన్ మొదలు పెట్టాయి. ఈ క్రమంలో బగల్జాప్ ప్రాంతంలో హెలికాప్టర్ శిథిలాలను గుర్తించినట్టు ఆర్మీ అధికారులు తెలిపారు.
దిరాంగ్‌లో కూలిపోయిన హెలికాప్టర్‌ను గ్రామస్తులు గుర్తించి జిల్లా అధికారులకు సమాచారం అందించారని స్పెషల్ ఇన్వెస్టిగేషన్ సెల్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ రోహిత్ రాజ్‌బీర్ సింగ్ వివరించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామన్నారు.