పూంచ్: దేశం వైపు దూసుకురాబోయి పరిస్థితి అడ్డం తిరగడంతో పాక్ తోకముడిచి పరారైంది. కాశ్మీర్ సరిహద్దుల్లో పాకిస్థాన్ సైనికులు శనివారం ఉదయం మరోసారి కాల్పులు జరిపారు. జమ్మూకశ్మీర్‌లోని పూంచ్ జిల్లా కృష్ణ ఘరి సెక్టారు పరిధిలో పాక్ సైనికులు కాల్పులకు దిగారు. భారత సైనికులు పాక్ ఆర్మీ దాడులను సమర్ధంగా తిప్పికొట్టింది. భారత సైనికుల ప్రతి దాడితో పాక్ సైనికులు తోక ముడిచి పారిపోయారు. పూంచ్ జిల్లాల్లో గత వారం పాక్ సైనికులు జరిపిన కాల్పుల్లో ఓ భారత సైనికుడు మరణించాడు. అప్పటి నుంచి అప్రమత్తంగా ఉన్న భారత భద్రతా బలగాలు పాకిస్థాన్ ఆర్మీ దాడిని తిప్పికొట్టాయి.