ఆర్మీకి సంబంధించిన ఎన్నో విషయాలు మనకు ఆసక్తికరంగా ఉంటాయి. ఆర్మీలో ఉద్యోగం చేయాలి అనుకునే వారిని చేసే వారిని సమాజంలో ఎక్కువగా గౌరవిస్తూ ఉంటారు. ఇక వాళ్ళు ఎలా ఉంటారు…? వాళ్ళ ఆహారపు అలవాట్లు ఏ విధంగా ఉంటాయి అనే విషయాలు తెలుసుకునే ప్రయత్నాలు కాస్త ఎక్కువగా చేస్తూ ఉంటారు. అందులో ప్రధానంగా వారి జుట్టు ఎందుకు అంత చిన్నగా ఉంటుంది…? ఇది చాలా మందిలో ఉన్న సందేహం.
Also Read:ఢిల్లీ ప్రభుత్వ శాఖలకు ఇక ఎలక్ట్రిక్ వెహికల్స్
ఆర్మీలో ఉద్యోగం చేయడానికి ఎక్కడి నుంచో వస్తు ఉంటారు. కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు ఎందరో విధులు నిర్వహిస్తూ ఉంటారు. ఆర్మీలో పదవులు పెద్దగా ఉంటాయి గాని మనుషులు అందరూ ఒకటే. ధనిక పేద అనే తేడాలు ఏమీ ఉండవు. హెయిర్ కట్ విషయంలో అటువంటి నిబంధన లేకపోతే ఎవరికి నచ్చినట్టు వాళ్ళు ఉంటారు. డబ్బున్న వాళ్ళు స్టైల్ గా వచ్చే అవకాశం ఉంటుంది. అది చూసి వేరే వాళ్ళు చిన్నతనంగా ఫీల్ అయ్యే అవకాశం ఉంటుంది.
అందుకనే ఆర్మీలో జుట్టు అలానే ఉండాలి అనే నిబంధన విధించారు. దానితో పాటుగా… యుద్ధ భూమిలో ఉన్న సమయంలో జుట్టు ఎక్కువగా ఉంటే… చికాకుగా ఉంటుంది. హెల్మెట్ కి కూడా సమస్య ఉంటుంది. ఇక వర్షం పడితే జుట్టులో నీరు నిలబడి జలుబు లాంటివి చేసే అవకాశాలు ఉంటాయి. ఇక జుట్టు ఎక్కువగా ఉండటంతో కొన్ని చికాకులు ఉంటాయి. ఆ జుట్టు అలా ఉండాలి ఇలా ఉండాలి అని టైం వేస్ట్ కూడా చేస్తారు. కాబట్టి అందరికి ఒకటే ఉంటే సమస్య ఉండదు. ఇక తలకు గాలి కూడా తగిలి మంచి ఆలోచనలు వస్తాయి.