అరుణాచల్ ప్రదేశ్‌లోని దిరాంగ్ జిల్లాలో ఆర్మీ హెలికాప్టర్ కుప్పకూలింది. మండల హిల్స్ ప్రాంతంలో భారత ఆర్మీ చిరుత హెలికాప్టర్ ఒక్కసారిగా కుప్పకూలిపోయింది. హెలికాప్టర్ లో పైలట్, కో-పైలట్ ఉన్నారు.
గురువారం ఉదయం 9.15 గంటల ప్రాంతంలో హెలికాప్టర్ కు ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ (ఏటీసీ)తో సంబంధాలు తెగిపోయినట్లు గౌహతి పబ్లిక్ రిలేషన్స్ ఆఫీసర్ లెఫ్టినెంట్ కల్నల్ మహేంద్ర రావత్ ధృవీకరించారు. సింగే నుండి మిసామారి వైపు వెళ్తున్న క్రమంలో ఈ ప్రమాదం చోటు చేసుకుంది.
పైలట్, కో పైలట్ కోసం గాలింపు చర్యలు చేపట్టినట్లు ఆర్మీ వర్గాలు తెలిపాయి.గతేడాది అక్టోబర్‌లో నెలలలో భారత ఆర్మీకి చెందిన హెలికాప్టర్ అరుణాచల్ ప్రదేశ్‌లోని అప్పర్ సియాంగ్ జిల్లా, సింగింగ్ ప్రాంతంలో కూలిన విషయం విధితమే. ఈ ఘటనలో హెలికాప్టర్‌లో ప్రయాణిస్తున్న ఐదుగురు మరణించారు.
మృతుల్లో ఇద్దరు పైలట్లు ఉన్నారు. ప్రమాదానికి గురైంది ఆధునిక తేలికపాటి, హెచ్ఏఎల్ రుద్ర అనే హెలికాప్టర్. ఈ హెలికాప్టర్ ఆ రోజు ఉదయం ట్యూటింగ్ ప్రధాన కార్యాలయం నుంచి బయలుదేరిన కొద్దిసేపటికే ప్రమాదానికి గురైంది