జమ్మూ కశ్మీర్ లోని లేహ్ లో ఓ 34 ఏళ్ల ఆర్మీ జవాన్ కు కూడా కరోనా టెస్ట్ పాజిటివ్ గా గుర్తించినట్టు ఆర్మీ వర్గాలు వెల్లడించాయి. ముందస్తు జాగ్రత్త చర్యల్లో భాగంగా కరోనా టెస్ట్ పాజిటివ్ గా తేలిన జవాన్ తో కలిసి బ్యారెక్ లో ఉన్న మరో పది మంది జవాన్ లను క్వారంటైన్ లో ఉంచి పరిశీలిస్తున్నారు. అదే విధంగా లద్దాఖ్ రెడిమెంట్ కేంద్రంలో ఉంటున్న 800 మంది సైనికులను బయటకు వెళ్లకుండా చేశారు. ఒక సైనికుడికి కరోనా టెస్ట్ పాజిటివ్ గా తేలడం ఇదే మొదటి సారి. కరోనా సోకిన వ్యక్తి లేహ్ సమీపంలోని గ్రామానికి చెందిన వాడు. అతని తండ్రికి ఇంతకు ముందే కరోనా సోకడంతో అతని నుంచి సైనికుడికి సోకినట్టు తెలుస్తోంది. అతను ఫిబ్రవరి 20న ఇరాన్ యాత్రకు వెళ్లి తిరిగి వచ్చాడు. అతనికి కరోనా పాజిటివ్ గా తేలడంతో ఫిబ్రవరి 29 నుంచి లద్దాఖ్ హార్ట్ ఫౌండేషన్ లోని క్వారంటైన్ లో ఉంచారు. సైనికుడు ఫిబ్రవరి 25 నుంచి మార్చి 2 వరకు సెలవులో ఉండి తండ్రితో కలిసి మెలిసి ఉన్నాడు. డ్యూటీలో చేరిన సైనికుడిని మార్చి 7 నుంచి 16 వరకు క్వారంటైన్ లో ఉంచారు. అతనికి కరోనా పాజిటివ్ గా నిర్ధారణ కావడంతో సోనమ్ నుర్బో మెమోరియల్ హాస్పిటల్ లోని ఐసోలేషన్ వార్డులో ఉంచారు.అతని సోదరి, భార్య, ఇద్దరు పిల్లలను కూడా క్వారంటైన్ లో ఉంచి పరిశీలిస్తున్నారు.