జమ్ముకశ్మీర్ లో మంచుతో కప్పబడిన ప్రాంతాల్లో విధులు నిర్వహిస్తున్న సైనిక దళాలకు బూస్టర్ డోసులను సరఫరా చేసేందుకు సైన్యం డ్రోన్లను ఉపయోగిస్తోంది. మిషన్ సంజీవనిలో భాగంగా దూర ప్రాంతాలకు వైద్య పరికరాలను సరఫరా చేసేందుకు డ్రోన్లను వినియోగిస్తోంది.
ఈ మేరకు డ్రోన్లతో వ్యాక్సిన్ సరఫరా చేస్తుండగా ఆర్మీ అధికారులు వీడియో తీసి సామాజిక మాధ్యమాల్లో షేర్ చేశారు. ఇప్పుడు ఆ వీడియోలు వైరల్ అవుతున్నాయి.
ఈ వీడియో ‘మిషన్ సంజీవని, డ్రోన్ల ద్వారా వైద్యపరికరాల సరఫరా” అనే నోట్ తో ప్రారంభం అవుతోంది. ఈ ప్రక్రియను మొత్తం స్థాయిల్లో విభజించారు.
మొదటి దశలో డెలివరీ ప్రక్రియ గురించి అధికారులకు వివరిస్తారు. రెండవ దశలో, డ్రోన్‌ల టేకాఫ్, డెలివరీ సైట్‌లను శుభ్రపరచడం. మూడవ దశలో, నిర్దేశిత గమ్యస్థానానికి ప్రయాణించే డ్రోన్‌కు వ్యాక్సిన్‌లతో కూడిన ప్యాకేజీని జతచేస్తారు. స్పాట్‌లో వేచి ఉన్న అధికారి సమక్షంలో ప్యాకేజీని నేలపై డ్రోన్ నేలపై పడవేస్తుంది. డ్రోన్ తిరిగి మొదటి ప్రదేశానికి తిరిగి వస్తుంది.