టోక్యో ఒలింపిక్స్ లో భారత్ కల నెరవేర్చాడు నీరజ్ చోప్రా. జావెలిన్ త్రో విభాగంలో స్వర్ణం ముద్దాడాడు. ఫైనల్ మ్యాచ్ లో అద్భుత ప్రదర్శనతో ఆకట్టుకున్నాడు.
మొదటి రౌండ్‌లో 87.03 మీటర్లు విసిరిన నీరజ్.. రెండో రౌండ్‌లో 87.58 మీటర్లు, మూడో రౌండ్‌లో 76.79 మీటర్ల దూరం విసిరాడు. ఆరో రౌండ్‌లో 84.24 మీటర్లు వేశాడు. అయితే ఎవరూ తనను అధిగమించకపోవడంతో అత్యధిక మీటర్లు విసిరిన ఆటగాడిగా నిలిచి బంగారు పతకం సాధించాడు.
నీరజ్ తర్వాత చెక్ రిపబ్లిక్ కు చెందిన జాకూబ్ కు రజతం దక్కగా అదే దేశానికి చెందిన మరో అథ్లెట్ విటెడ్జ్ స్లావ్‌కు కాంస్యం సొంతమైంది.
History has been scripted at Tokyo! What @Neeraj_chopra1 has achieved today will be remembered forever. The young Neeraj has done exceptionally well. He played with remarkable passion and showed unparalleled grit. Congratulations to him for winning the Gold. #Tokyo2020 https://t.co/2NcGgJvfMS
— Narendra Modi (@narendramodi) August 7, 2021
Advertisements
ఇక స్వర్ణం సాధించిన నీరజ్ ను ప్రధాని మోడీ అభినందించారు. ఇది ఎప్పిటీకీ గుర్తుండిపోతుందన్న ఆయన.. నీరజ్ అద్భుతంగా రాణించాడని కొనియాడారు.