శివసేన ఎంపీ సంజయ్ రౌత్ కు ఇండియన్ బార్ అసోసియేషన్ షాక్ ఇచ్చింది. బాంబే హైకోర్టు న్యాయమూర్తులపై తప్పుడు వ్యాఖ్యలు చేసినందుకు, ధిక్కార వ్యాఖ్యలను చేసినందుకు ఆయనపై కోర్టు ధిక్కార వ్యాజ్యం, ప్రజాప్రయోజన వ్యాజ్యలను దాఖలు చేసింది.
చీటింగ్ కేసులో బీజేపీకి చెందిన కిరీట్ సోమయ్యకు అరెస్టు నుంచి రక్షణ కల్పిస్తూ ఉత్తర్వులు జారీ చేసినందుకు న్యాయమూర్తులతో పాటు మొత్తం న్యాయవ్యవస్థపై న ఎంపీ సంజయ్ రౌత్ వ్యాఖ్యలు చేయడమే ఇందుకు కారణంగా తెలుస్తోంది.
కిరిటికి ఉపశమనం కలిగించేలా వచ్చిన ఉత్తర్వులపై ఎంపీ సంజయ్ రౌత్ మాట్లాడుతూ… న్యాయ స్థానాలు ఒక చేత్తో బీజేపీ నాయకులకు ఉపశమనం కలిగిస్తున్నాయని, మరో వైపు శివసేన, ఎన్సీపీ నాయకులకు ఉపశమనం కలిగించడానికి నిరాకరిస్తు్న్నాయంటూ న్యాయమూర్తులపై ఆరోపణలు చేశారు. కోర్టుల పక్షపాత ధోరణిలో వ్యవహరిస్తున్నాయన్న ధోరణిలో ఆయన వ్యాఖ్యలు చేశారు.
దీంతో ఆయనకు కోర్టు ధిక్కార నోటీసులను ఇండియన్ బార్ అసోసియేషన్ పంపించింది. ఇందులో ప్రతివాదులుగా మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాకరే, హోం మంత్రి దిలీప్ వాల్సే పాటిల్, సామ్నా ఎడిటర్ రష్మీ థాకరేల పేర్లను కూడా బార్ అసోసియేషన్ చేర్చింది.