అడిలైడ్ లో ఆస్ట్రేలియా-భారత్ మధ్య జరుగుతున్న మొదటి పింక్ బాల్ టెస్ట్ లో అనూహ్య పరిణామం చోటు చేసుకుంది. మొదటి ఇన్నింగ్స్ లో ఆస్ట్రేలియాను 200లోపే ఆలౌట్ చేసిన భారత్, రెండో ఇన్నింగ్స్ కు దిగింది. రెండో రోజు ఆట ముగిసే సమయానికి 7 పరుగులకు ఒక వికెట్ నష్టపోయింది.
మూడో రోజు ఆట ప్రారంభంతోనే భారత్ బ్యాటింగ్ తడబడింది. వరుసగా వికెట్లు కోల్పోయింది. కేవలం 36 పరుగులకే భారత్ ఆలౌట్ అయి చెత్త రికార్డును నమోదు చేసింది. గతంలో భారత్ 42పరుగుల అత్యల్ప స్కోరు చేసింది.
భారత్ వికెట్ల పతనం సాగిందిలా…
7పరుగులకు తొలి వికెట్ పడగా, 15 పరుగుల వద్ద 2,3,4,5 వికెట్లను కోల్పోయింది. 19 పరుగుల వద్ద 6వ వికెట్, 26 పరుగుల వద్ద 7,8వికెట్లను కోల్పోయింది. 31పరుగుల వద్ద 9వ వికెట్ కోల్పోగా… 2 పరుగులు చేసిన షమీకి బలమైన గాయం కావటంతో గ్రౌండ్ ను వీడాడు. దీంతో ఫస్ట్ ఇన్నింగ్స్ లీడ్ కలిపి భారత్ 89 పరుగుల ఆధిక్యంలో ఉండగా, ఆస్ట్రేలియా టార్గెట్ 90 పరుగులయ్యింది.దీన్ని ఆసీస్ కేవలం 2వికెట్లు మాత్రమే కోల్పోయి అలవోకగా చేధించింది.
భారత ఆటగాళ్లలో 9పరుగులతో మయాంక్ టాప్ స్కోరర్ గా ఉండగా, పృథ్వీషా, కోహ్లి, సాహా 4 పరుగులు చేశారు. హనుమ విహారి 8 పరుగులు, బుమ్రా2, ఉమేష్ 3 పరుగులు చేశారు. మిస్టర్ డిపెండబుల్ గా పేరున్న పుజారా, రహేనేలు డకౌట్ అయ్యారు.