టీం ఇండియా స్పిన్నర్ యజువేంద్ర చాహల్ పెళ్లి పీటలెక్కబోతున్నాడు…మేమిద్దరం ఒకటి కాబోతున్నాం అంటూ రోకా పార్టి ఫోటోని సోషల్ మీడియాలో శేర్ చేసాడు..ప్రస్తుతం చాహల్ రోకా సెలబ్రేషన్ ఫోటో ఒకటి సోషల్ మీడియాలో తెగ వైరలవుతోంది.. ఆ ఫోటో వైరల్ కావడానికి రీజన్ యజుకి కాబోయే భార్య కాదు..తను పెట్టుకున్న వాచ్.. మీరు చదివింది నిజమే..అంత స్పెషల్ ఏంటీ అనుకుంటున్నారా..?
యజువేంద్ర ఛాహల్ తన ప్రేయసి ధనుశ్రీ వర్మను పెళ్లాడబోతున్నాడు.. తను ఒక డాక్టర్..అంతేకాదు యూట్యూబర్ మరియు కొరియో గ్రాఫర్ ..లాక్ డౌన్ సమయంలో ఒక జూమ్ వర్క్ షాప్లో ఇద్దరూ మీట్ అవ్వడం ప్రేమలో పడడం, పెద్దల అంగీకారంతో పెళ్లి జరుతుండడం అన్ని చకచకా జరిగిపోయాయి..తన ప్రేయసి కమ్ కాబోయే భార్యని పరిచయం చేస్తూ ట్విట్టర్లో ఒక పొటో శేర్ చేసాడు యుజీ
కొందరు ఆ జంటను మేడ్ ఫర్ ఈచ్ అదర్ అని విష్ చేస్తుంటే చాలామంది దృష్టి మాత్రం యజువేంద్ర పెట్టుకున్న వాచ్ పై పడింది..వాచ్ ల కంపెనికి రారాజు రోలెక్స్ తెలుసు కదా..ఆ కంపెనికి చెందిన వాచ్ అది రోలెక్స్ డేట్ జస్ట్ 41.. ఖరీదు అక్షరాల తొమ్మిది లక్షల ఎనభై వేల రూ..పైన చిల్లర .. అబ్బో అంత స్పెషల్ ఏంటో… స్పెషలే మరి బంగారం బెజెల్, జూబ్లీ బ్రేస్లెట్.. రోడియం డార్క్ డయల్… ఆ మాత్రం ఉంటుంది లెండి..ఈ బ్రాండ్ లో ఇదే ఎక్కువ ధరది.. ఇప్పుడు ఈ ఫోటో నెట్లో వైరలవ్వడానికి రీజన్ కూడా ఆ వాచ్.. ఆ రేటు.. హ్మ్. పాపం ధనుశ్రీ ..క్రికెటర్ ని పెళ్లాడుతున్నా ఏ మాత్రం ఫేమ్ అవ్వలేదు.!