ప్రపంచంలో అత్యంత వేగంగా పరుగెత్తే రన్నర్ ఎవరంటే ఉసేన్ బోల్ట్ అని టక్కున సమాధానం చెబుతారు. జమైకాకు చెందిన ఈ రన్నర్ 100 మీటర్ల రన్నింగ్ లో ప్రపంచ రికార్డ్ ను సృష్టించారు. 9.58 సెకన్లలో 100 మీటర్లు పరిగెత్తి ప్రపచంలోనే తనకు సాటి ఎవరూ లేరని నిరూపించాడు. కానీ కర్ణాటకకు చెందిన శ్రీనివాస గౌడ… బోల్ట్ రికార్డును బ్రేక్ చేశాడు. సరికొత్త రికార్డును సృష్టించాడు. దక్షిణ కర్ణాటకలోని మూడబిదిరికి చెందిన శ్రీనివాస గౌడ(28) బురద పొలాల్లో జరిగే దున్నపోతుల పోటీ (కంబాల) లో 145.5 మీటర్లను కేవలం 13.62 సెకన్లలో పరుగెత్తాడు. అంటే 100 మీటర్లను 9.55 సెకన్లలో దాటి రికార్డు సృష్టించాడు.
Advertisements