ఆడ, మగ కలవడం చాలా తేలిక. కానీ కలిసిబతకడం కష్టం. వారి అభిప్రాయాలు అభిరుచులు,ఆశలు, ఊసులు అన్నీ కలవాలి. అది రిలేషన్షిప్ అయినా, ప్రేమైనా, పెళ్ళైనా,ఇంకోటైనా,ఇంకేదైనా.
కలిసిబతకడం కష్టమైనప్పుడు…కలిసి విడిగా ఉండడం కన్నా, విడిపోయి ఎవరిమానాన వారు బతకడం మంచివిషయమని చెప్పాలి. ఇది సామాన్యులకే కాదు, సెలబ్రిటీలకు కూడా వర్తిస్తుంది. అయితే సినిమా ప్రపంచంలో ఈ కూడికలు, తీసివేతలు ఇంకాస్త ఎక్కువని చెప్పడం కన్నా, చాలా కామన్ అని చెప్పడం కరెక్టుగా ఉంటుంది.
అయితే సినీరంగంలో రెండు లేదా అంతకంటే ఎక్కువ పెళ్ళిళ్ళు చేసుకున్న సెలెబ్రిటీల లిస్టు పెద్దదే ఉంది. సౌత్ లో జెమినీ గణేశన్ నుంచి మొదలు కొని నార్త్ లో ధర్మేంద్ర వరకూ చాలా మంది ఉన్నారు. మరి ఆ సెలబ్రిటీల పెళ్ళిళ్ళ పరంపర గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.
1.జెమినీ గణేశన్
అలమేలు గణేశన్ (1940–2005)
జులియానా గణేశన్ (1997–2005)
సావిత్రి (1952–1981)
2. ఎన్టీఆర్
బసవతారకం (1942 -1985)
లక్ష్మి పార్వతి (1993 )
3. ధర్మేంద్ర
ప్రకాష్ కౌర్ (1954)
హేమ మాలిని (1980),
4. కిషోర్ కుమార్
రామ ఘోష్ (1950-1958)
మధుబాల (1960 -1969)
యోగీత బాలి (1976- 1978)
లీనా చందవర్కర్ (1980)
5. బోనీ కపూర్
మోనా శౌరీ కపూర్ (1983–1996)
శ్రీదేవి (1996–2018)
6. అక్కినేని నాగార్జున
లక్ష్మి దగ్గుబాటి (1984–1990)
అమల (1992)
7. కమల్ హాసన్
వాణి గణపతి (1978–1988)
సారిక (1990–2004)
8. సైఫ్ అలీ ఖాన్
అమ్రితసింగ్(1991–2004)
కరీనా కపూర్ (2012)
9. సంజయ్ దత్
రిచా శర్మ (1987- 1996)
రియా పిళ్ళై (1998 -2008)
మాన్యత దత్ (2008)
10. కరణ్ సింగ్ గ్రోవర్
శ్రద్ధ నిగమ్ – (2008- 2009)
జెన్నిఫర్ వింగ్స్ ( 2012- 2014)
బిపాషా బసు (2016)
11. ఆమిర్ ఖాన్
రీనా దత్త (1986 – 2002)
కిరణ్ రావు (2005- 2021)
12. రాధిక శరత్ కుమార్
రిచర్డ్ హార్డీ (1990-1992)
ప్రతాప్ పోతన్ (1985- 1986)
ఆర్. శరత్ కుమార్ ( 2001)
13. ఫర్హాన్ అక్తర్
అధునా బాబాని ( 2000–2017)
శిబాని దండేకర్ ( 2022)
14. పవన్ కళ్యాణ్
నందిని (1997 – 2007)
రేణు దేశాయ్ ( 2009 – 2012)
అన్న లెజెనేవ (2013)
15. మంచు మనోజ్
ప్రణతి రెడ్డి ( 2015 – 2019)
భూమా మౌనిక రెడ్డి (2023 )