ఇంగ్లాండ్ తో టెస్ట్ సిరీస్ ఆడుతున్న భారత జట్టులో కరోనా కలకలం రేపుతోంది. ప్రధాన కోచ్ రవిశాస్త్రితో పాటు నలుగురు సహయక సిబ్బంది కరోనా బారిన పడ్డట్లు తెలుస్తోంది. దీంతో వారంతా ఐసోలేషన్ లో ఉన్నట్లు బీసీసీఐ అధికారికంగా ధృవీకరించింది.
కోచ్ రవిశాస్త్రి, భరత్ అరుణ్, ఆర్.శ్రీధర్, నితిన్ పటేల్ లు పాజిటివ్ గా తేలారు. వీరంతా ప్రస్తుతం లండన్ లో వైద్యుల పర్యవేక్షణలో ఉన్నారు. రవిశాస్త్రి పాజిటివ్ గా తేలగానే టీం సభ్యులందరికీ రెండు దఫాలుగా కరోనా పరీక్షలు చేశారు. అయితే, ఆటగాళ్లు ఎవరికీ వైరస్ సోకలేదని తేలింది. ఓవల్ లో ప్రస్తుతం టెస్ట్ మ్యాచ్ జరుగుతోంది.